Ticker

6/recent/ticker-posts

కొవిడ్‌తో ఊపిరితిత్తుల్లో నష్టం ఇలా.. !

బెర్లిన్ : తీవ్రస్థాయి కొవిడ్ -19 వల్ల ఊపిరితిత్తుల్లో జరిగే నష్టాన్ని జర్మనీ శాస్త్రవేత్తలు ఆవిష్కరించారు. దెబ్బతిన్న ఊపిరితిత్తుల కణజాలాన్ని చిత్రీకరించడానికి వీరు హై రిజల్యూషన్ ఇమేజింగ్ తో కూడిన వినూత్న విధానాన్ని ఉపయోగించారు. ఈ మహమ్మారికి చికిత్స చేయడానికి కొత్త మార్గాలను కనుగొనడానికి ఈ పరిశోధన ఉపయోగపడుతుందని వారు చెప్పారు. గాటింగెన్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు ఈ పరిశోధన చేశారు. వీరు ఒక వినూత్న ఎక్స్ రే విధానాన్ని కనుగొన్నారు. ఇది కరోనా వైరస్ తో ఇన్ ఫెక్షన్ కు గురైన ఊపిరితిత్తుల కణజాలాన్ని త్రీడీలో, అత్యధిక రిజల్యూషన్ తో చిత్రీకరించడానికి వీలు కల్పించింది. ‘‘అంతర్గతంగా ఏం జరుగుతోందన్నది మనం స్పష్టంగా చూడటం వల్ల రోగి ఉపశమనానికి ఎలాంటి విధానాలు, ఔషధాలు ఉపయోగించాలన్న దానిపై స్పష్టత వస్తుంది’’ అని పరిశోధనలో పాలుపంచుకున్న డేనీ జోనిగ్ చెప్పారు.

Post a Comment

0 Comments