*కోవిడ్ నుండి కోలుకుని ఇంటికి వెళ్ళిన వారిలో కొందరే ఎందుకు మరలా ఆయాస పడుతున్నారు*
(COMMAND CONTROL ROOM COVID-19)
కోవిడ్ నుంచి కోలుకున్నవారిలో కొందరు మాకు ఆయాసం ఉంది అని ఫోన్లో అడుగుతున్నారు. ఇటీవలే ఒక కేంద్రమంత్రి వర్యులు కూడా డిశ్చార్జ్ అయినా మరలా ఆసుపత్రి లో చేర్చవలసి వచ్చింది. ఇది ఎందుకో తెలుసుకుందామా.
కోవిడ్ వచ్చిన 80% మందికి వచ్చిందా లేదా అన్నట్లుగా ను, తెలియక వచ్చి పోయిన వారిలో ఏమి ఈ కష్ఠం రాదు.
మిగిలిన 15% మందిలో కొంచెం ఆక్సిజన్ తీసుకుని రికవరీ అయిన వారిలో కూడా ఈ కష్టం అంత కామన్ గా రాదు.
మిగిలిన 5% లో ఎవరికైతే ఎక్కువ ఆక్సిజన్ ట్రీట్మెంటు, CPAP ట్రీట్మెంటు, వెంటిలేటర్ వైద్యప్రక్రియ జరిగిన దో వీరిలో చాలామంది లో వైరస్ చనిపోయినప్పటికీ, రికవరీ అయి ఇంటికి వెళ్ళినా కొంచం ఆయాసం ఉంటుంది.
డయాబెటిస్, బి.పి.. ఊబకాయ సమస్య, జెనిటీక్ కారణాల వల్ల, అతి ఎక్కువగా ఆక్సిజన్ వాడడం వల్ల ఈ సమస్య రావచ్చు. ఇది పల్మనరీ పైబ్రోసిస్ కు దారి తీయవచ్చు.
మామూలుగా మనం గాలి తీసుకుని వదిలే గాలి పరిమాణము ను టైడల్ వాల్యూము అని, గట్టిగా గాలి తీసుకొని వదిలేసి న పరిమాణము ను ఫోర్సుడు వైటల్ కెపాసిటీ FVC అంటారు. ఒక సెకనులో ఎంత బలంగా గాలిని వదులుతామో దానిని FEV1 అంటారు. ఇవి ఊపిరితిత్తుల ఫంక్షన్ టెస్ట్ చేసే మెషిన్ ద్వారా తెలుస్తుంది. మామూలుగా టైడల్ వాల్యూమ్ బాగున్నా ఈ FVC, FEV1 దాని నిష్పత్తి FEV1/FVC వీళ్ళలో తగ్గి ఉంటుంది.
మన ఊపిరితిత్తుల లో ఆక్సిజన్ మార్పిడి జరిగే ఆల్వియోలై కాపిల్లరీ మెంబ్రేన్ దగ్గర జరిగే సైటోకైన్ల డామేజీ మన బాడీ రియాక్షన్ యుద్ధవాతావరణం సృష్టించి ARDS కు దారితీస్తుంది. కాని రికవరీ అయినప్పటికీ అక్కడ స్కార్స్ అంటే మచ్చలు ఏర్పడతాయి. ఇవి ఎలా మారతాయి అనే దానిని బట్టే మన భావి జీవితం ఆధార పడుతుంది. ఇది కొందరిలో ఊపిరితిత్తుల డ్యామేజీకి కారణం అయ్యే పల్మనరీ ఫైబ్రోసిస్ కు దారి తీయవచ్చు.
అయితే ఇంటికి వెళ్ళినప్పటికీ వీరు మామూలుగా ఎక్కువ పని చేసుకోలేరు. కొంచెం ఎక్కువ పని చేసినా, గట్టిగా ఎక్కువ సేపు మాట్లాడుతూ ఉన్నా ఆయాసం వస్తూ ఉంటుంది. ఇది 4 నుంచి 6 వారాలు ఉండవచ్చు. వీరు ఎక్కువగా శారీరకంగా శ్రమచేయకుండా విశ్రాంతి తీసుకోవాలి. 3 బాల్సు ఉండే ఇంన్సెంటివ్ స్పైరోమీటర్ అనే 200 రూపాయలు విలువకల పరికరం కొనుగోలు చేసి దానితో ఊపిరితిత్తులు కు ఎక్సర్ సైజ్ చేయాలి. ప్రతి గంటకు 5 నిముషాలు చొప్పున చేస్తూ ఉండాలి. ఒక వేళఎక్కువ ఆయాసం ఉంటే ఆసుపత్రి లలో మరలా చేరాలి.
అయితే SARS, MERS లో ఉన్న అనుభవపూర్వకం దృష్ట్యా కోవిడ్ లో కూడా అలాగే ఊపిరితిత్తుల లో చారలు ఎక్కువగా అయి ఆయాసం అలాగే ఉంటుందా అనేది కాలమే సమాధానం చెప్పాలి.
Dr.C. ప్రభాకర రెడ్డి MS MCh (CTVS)
గుండె మరియు ఊపిరితిత్తుల శస్త్ర చికిత్స నిపుణులు
కర్నూలు. ఆంధ్రప్రదేశ్,
(కోవిడ్ కమాండ్ కంట్రోల్ ప్రత్యేక అధికారి)
0 Comments