నిన్న స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు ఈరోజు కూడా మరికొంత తగ్గాయి. హైదరాబాద్ లో బంగారం ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. బంగారం ధరలు ఈరోజు (ఆగస్టు 25) దేశీయంగా కిందికి కదిలాయి. మరో వైపు వెండి ధరలు కూడా తగ్గుతూ వస్తున్నాయి.
హైదరాబాద్ లో బంగారం ధరలు..
హైదరాబాద్ లో బంగారం ధరలు ఈరోజు కొద్దిగా తగ్గాయి. మంగళవారం (25.08.2020) బంగారం ధరలు సోమవారం ధరలతో పోలిస్తే తగ్గుదల నమోదు చేశాయి. పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం 460 రూపాయలు తగ్గి 50,030 రూపాయల వద్ద నిలిచింది. అదేవిధంగా 24 క్యారెట్ల బంగారంకూడా పది గ్రాములకు 490 రూపాయలు తగ్గుదల నమోదు చేసింది. దీంతో 54,580 రూపాయల వద్ద నిలిచింది.
0 Comments