Ticker

6/recent/ticker-posts

టిక్‌టాక్‌ను గూగుల్‌ కొంటోందా..?


 వీడియో యాప్ టిక్ టాక్ ను కొనుగోలు చేసే ఉద్దేశం గూగుల్ కు లేదని సంస్థ ముఖ్య కార్యనిర్వహణాధికారి (సీఈఓ) సుందర్ పిచాయ్ స్పష్టం చేశారు. టిక్ టాక్ సెప్టెంబర్ 15లోగా అమెరికాలో కార్యకలాపాలను మూసివేయాలంటూ ట్రంప్ ప్రభుత్వం ఆదేశాలు జారీచేసిన సంగతి తెలిసిందే. కాగా, మైక్రోసాఫ్ట్ , ట్విటర్ తదితర అమెరికా సంస్థలు దానిని చేజిక్కించుకునే ప్రయత్నాలు సాగిస్తున్నాయి.

ఈ నేపథ్యంలో ఓ అన్ లైన్ మీడియా సంస్థ ఇంటర్వ్యూలో.. గూగుల్ కూడా ఈ రేసులో ఉందా అనే ప్రశ్నకు పిచాయ్ స్పందించారు. ఈ యాప్ తమ క్లౌడ్ సర్వీసెస్ సేవలను ఉపయోగించుకుంటోందని, అందుకు రుసుము చెల్లిస్తున్నట్టు ఆయన వెల్లడించారు. అయితే ఆ సంస్థను కొనుగోలు చేసే ఆలోచనలో గూగుల్ లేదని పిచాయ్ వెల్లడించారు. గూగుల్ మాతృసంస్థ ఆల్ఫాబెట్ గ్రూప్ బిడ్ లో చేరుదామని తొలుత భావించినా.. అనంతరం విరమించుకున్నట్టు తెలిసింది.

Post a Comment

0 Comments