ఫిబ్రవరిలో న్యూజిలాండ్ పర్యటన తర్వాత స్వదేశానికి తిరిగి వచ్చిన కోహ్లీ ఆపై దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్ కు సిద్ధమయ్యాడు. కరోనా పరిస్థితుల వల్ల ఆ టోర్నీ రద్దవ్వడం, అనంతరం లాక్ డౌన్ విధించడంతో ఇంటికే పరిమితమయ్యాడు. ఆ సమయంలో కోహ్లీ దంపతులు సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా కనిపించారు. ఆపత్కాలంలోనూ విరాళాలు సేకరించారు. అలాగే ఇటీవల వరదల కారణంగా నిరాశ్రయులైన వారికి తమ వంతుగా సాయం చేశారు.
లాక్ డౌన్ తర్వాత ఐపీఎల్ పై స్పష్టత రావడంతో కోహ్లీ మళ్లీ బ్యాట్ పట్టాడు. గతవారమే ఆర్సీబీ దుబాయ్ కి చేరుకుంది. ఆటగాళ్లంతా ఇప్పుడక్కడ క్వారెంటైన్ లో ఉన్నారు. కోహ్లీ కూడా గతవారం ప్రత్యేక విమానంలో అక్కడికి చేరుకున్నాడు. క్వారెంటైన్ సమయంలోనూ ఫిట్ నెస్ కాపాడుకుంటూ హోటల్ గదిలోనే శారీరక వ్యాయామాలు చేస్తున్నాడు. నేటితో ఆ గడువు కూడా పూర్తికానుంది. రేపటి నుంచి పూర్తి స్థాయిలో సాధన మొదలెడతాడు. ఈ నేపథ్యంలోనే గురువారం సామాజిక మాధ్యమాల్లో శుభవార్త చెప్పేశాడు. దీంతో అటు అభిమానుల నుంచీ, ఇటు తోటి క్రికెటర్ల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. మరోవైపు అనుష్క పోస్టుకు బాలీవుడ్ , టాలీవుడ్ హీరోయిన్లు కూడా కంగ్రాట్స్ తెలిపారు.
0 Comments